Share News

Lok Sabha Elections 2024: అమేథీ, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థులపై వీడనున్న సస్పెన్స్

ABN , Publish Date - Apr 27 , 2024 | 02:49 PM

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.

Lok Sabha Elections 2024: అమేథీ, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థులపై వీడనున్న సస్పెన్స్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి (Amedhi), రాయబరేలి (Raebareli) నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.


ఐదో విడత లోక్‍సభ ఎన్నికల్లో పోలింగ్‌లో అమేథీ, రాయబరేలి నియోజకవర్గాల్లో మే 20న ఎన్నికలు జరుగనున్నాయి. అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నామినేషన్లు వేసే ముందు ఇద్దరూ అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించనున్నట్టు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా, రెండో సీటుగా అమేథీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే అమేథీ నుంచి రాహుల్ పోటీ పడటం ఇది మూడోసారి అవుతుంది. మూడోసారి బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న స్మృతి ఇరానీతో ఆయనతో తలపడనున్నారు. ప్రియాంక గాంధీ రాయబరేలి నుంచి నామినేషన్ వేస్తే ఎన్నికల్లో ఆమె లోక్‌సభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ 'ఫేక్ వీడియో'.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు


స్మృతి ఇరానీ 2019లో రాహుల్ గాంధీని ఓడించేంత వరకూ అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో ఇక్కడి నుంచి స్మృతి ఇరానీపై రాహుల్ 1,07,903 ఓట్ల ఆధిక్యంతో గెలువగా, 2019లో 55,120 ఓట్ల ఆధిక్యంతో స్మృతిఇరానీ రాహుల్‌పై గెలిచారు. రాయబరేలిలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు నిలిచినా ఈసారి కూడా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో ఉంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 02:49 PM