Share News

Congress moves EC: మోదీ 'ముస్లింలీగ్' వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:53 PM

'న్యాయ్ పత్ర' పేరుతో తాము విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను 'ముస్లింలీగ్'తో పోలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ చర్యలకు దిగింది. ప్రధాని వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ కు సోమవారంనాడు ఫిర్యాదు చేసింది.

Congress moves EC: మోదీ 'ముస్లింలీగ్' వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

న్యూఢిల్లీ: 'న్యాయ్ పత్ర' (Nyay Patra) పేరుతో తాము విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను 'ముస్లింలీగ్' (Muslim League)తో పోలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ చర్యలకు దిగింది. ప్రధాని వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ (Electon commission)కు సోమవారంనాడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్‌ను కలిసి ప్రధానిపై రెండు ఫిర్యాదులతో సహా మొత్తం ఆరు ఫిర్యాదులను అందజేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో తెలిపారు. సల్మాన్ ఖుర్షీద్, పవన్‌ఖేర, గుర్దీప్ సప్పల్‌తో కూడిన పార్టీ ప్రతినిధి బృందం ఇప్పుడే ఈసీని కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.


కాంగ్రెస్ 'న్యాయ్‌పత్ర' దేశాన్ని విభజించే ప్రయత్నంగా, స్వాతంత్ర్యానికి ముందు ముస్లింలీగ్ ఐడియాలజీని బలవంతంగా రుద్దడంగా మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమని ఈసీకి తాము ఫిర్యాదు చేసినట్టు జైరామ్ రమేష్ తెలిపారు. అన్ని పార్టీలకు ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలున్నందున ఈ విషయంలో ఎన్నికల కమిషన్ స్వంతంత్రంగా వ్యవహరించేందుకు ఇదే తగిన తరుణమని అన్నారు. తమ ఫిర్యాదులపై ఈసీ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Lok Sabha Elections: జేకేలో కాంగ్రెస్, ఎన్‌సీ మధ్య కుదిరిన డీల్


మోదీ ఏమన్నారు?

ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో గత శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రధానమంత్రి తప్పుపట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ముస్లింలీగ్‌లో ఉన్న ఆలోచననే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలీగ్ ముద్ర ఉందని, ఈ ముస్లిం లీగ్ మేనిఫెస్టోలోని మిగిలిన భాగాలపై వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయని విమర్శించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 06:53 PM