National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:32 AM
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్‌కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
ఢిల్లీ: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల(Sikkim, Arunachal Pradesh Assemblie Elections) ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్‌కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో 60స్థానాలకు 54స్థానాల్లో ట్రెండ్ వెల్లడైంది. 10స్థానాల్లో బీజేపీ ఇప్పటికే ఏకగ్రీవమైంది. మరో 29స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8స్థానాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ, 3స్థానాల్లో ఎన్సీపీ, 2స్థానాల్లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్, 1స్థానంలో కాంగ్రెస్, 2స్థానాల్లో స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
For Latest News and National News click here..