Delhi : మెజార్టీ బడి పిల్లలు వ్యాయామ విద్యకు దూరం
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:18 AM
ప్రపంచంలో అత్యధిక శాతం బడి పిల్లలకు కనీస వ్యాయామ విద్య అందుబాటులో లేదని యునెస్కో పేర్కొంది
న్యూఢిల్లీ, జూలై 28: ప్రపంచంలో అత్యధిక శాతం బడి పిల్లలకు కనీస వ్యాయామ విద్య అందుబాటులో లేదని యునెస్కో పేర్కొంది. ఈ మేరకు ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ ప్లే’ పేరిట తొలిసారి ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై రూపొందించిన నివేదికను తాజా వెల్లడించింది. నివేదిక ప్రకారం... 58 శాతం దేశాలు మాత్రమే బాలికలకు శారీరక విద్యను తప్పనిసరి చేశాయి.
7 శాతం దేశాలు మాత్రమే అబ్బాయిలతో అమ్మాయిలు సమానంగా వ్యాయామ విద్యను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సగం మంది ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లలు, ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాధ్యమిక స్థాయి స్కూల్ పిల్లలకు వారంలో కనీసం నిర్వహించవల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ తరగతులు జరగడం లేదని తెలిపింది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరి కంటే తక్కువ మందే వ్యాయామ విద్యలో శిక్షణ పొందారని పేర్కొంది. మూడింట రెండొంతుల దేశాలు తమ విద్యా బడ్జెట్లో 2 శాతం కూడా కేటాయించడం లేదని యునెస్కో తన నివేదికలో తెలిపింది.