Share News

Devendra Fadnavis: ‘‘నేను ఆధునిక ఆభిమన్యుడిని.. చక్రవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో బాగా తెలుసు’’

ABN , Publish Date - Nov 23 , 2024 | 05:35 PM

తాను ఆధునిక అభిమన్యుడినని.. చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తనకు బాగా తెలుసనని బీజేపీ సీనియన్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో 231 సీట్లు గెలుచుకుని భారీ విజయం నమోదు చేసింది. ఈ సందర్భంగా..

Devendra Fadnavis: ‘‘నేను ఆధునిక ఆభిమన్యుడిని.. చక్రవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో బాగా తెలుసు’’

ముంబై: తాను ఆధునిక అభిమన్యుడినని.. చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తనకు బాగా తెలుసనని బీజేపీ సీనియన్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో 231 సీట్లు గెలుచుకుని భారీ విజయం నమోదు చేసింది. ఈ సందర్భంగా ఫడణవీస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రెండు నెలల క్రితం అన్న మాటలను గుర్తు చేశారు.


ప్రతిపక్ష కూటమి తనను చిక్కుల్లో పెట్టాలని చూస్తోందని, కానీ తాను ఆధునిక అభిమన్యుడినని, చక్రవ్యూహంలోకి ప్రవేశించడమే కాకుండా నిష్క్రమించడం కూడా తెలుసని సెప్టెంబర్‌లో అన్న మాటలను గుర్తు చేశారు. తాను ఆధునిక అభిమన్యుడినని ముందే చెప్పానని, చక్రవ్యూహాన్ని ఖఎలా బద్ధలు కొట్టాలో తనకు బాగా తెలుసని చెప్పారు. మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ శ్రేణులు, నేతలందరి మద్దతుతో ఈ అఖండ విజయం సొంతమైందన్నారు.


ప్రజలు నరేంద్ర మోదీ వెంటే ఉన్నారు అనడానికి ఈ విజయమే నిదర్శమని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరన్న విషయం ‘‘మహాయుతి’’ నేతలంతా కలిసి మాట్లాడుకుని నిర్ణయిస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదమూ లేదని ఫడణవీస్ తెలిపారు. ఎన్‌డీఏ కూటమి విజయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేసులో దేవేంద్ర ఫడణవీస్ ముందుండడంతో అందరి దృష్టీ ఆయనపైనే ఉంది. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి ఫడ్నవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 23 , 2024 | 05:38 PM