Share News

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:48 AM

తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

  • సెంథిల్‌బాలాజీకి మళ్లీ మంత్రిపదవి

చెన్నై, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యో తి): తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీఎం స్టాలిన్‌ సిఫారసు మేరకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న ఉదయనిధిని గవర్నర్‌ రవి ఉపముఖ్యమంత్రిగా నియమిస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాట తొలిసారిగా స్టాలిన్‌ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకే హయాంలో ఒ పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. తమిళనాడు మూడో ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కొత్తగా నలుగురు మంత్రు లు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో అక్రమ నగదు బట్వాడా తదితర అవినీతి కేసులో అరెస్టయి 15మాసాలపాటు జైలులో గడుపుతూ ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన బెయిలుపై విడుదలైన సెంథిల్‌బాలాజీ కూడా ఉన్నారు. ఈయనకు మళ్లీ విద్యుత్‌, ఎక్స్‌జ్‌శాఖలను కేటాయించారు.

Updated Date - Sep 30 , 2024 | 04:48 AM