Mamata Benerjee: అలాంటి వారికి టీఎంసీలో చోటు లేదు.. పార్టీ నేతలకు మమతా స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Feb 27 , 2024 | 09:00 PM
సందేశ్‌ఖలి ఘటన సందర్భంగా సొంత పార్టీ నేతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లలోని మా నాయకులందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.
సందేశ్‌ఖలి ఘటన సందర్భంగా సొంత పార్టీ నేతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లలోని మా నాయకులందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్నందరినీ గెలిపించింది ప్రజలే. వారు ఓట్లు వేయడం వల్లే అధికారంలోకి వచ్చారు. కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది. మీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే మళ్లీ ఓట్లతోనే సమాధానం చెబుతారు. ఒకవేళ మీరు ఓడిపోతే మీ వైపు ఎవరూ చూడరు. ఈ సిద్ధాంతాన్ని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. టీఎంసీలో ఉన్నవారు సైతం ఇదే నమ్మాలని కోరుకుంటున్నాను. అలా చేయలేని వారు వారి వారి ఇళ్లకైనా వెళ్లండి. లేకపోతే వేరే పార్టీలో చేరండి. అంతే కానీ అలాంటి వారికి పార్టీలో స్థానం ఇచ్చి ప్రజలను దూరం చేయలేను" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పురులియా జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని సందేశ్‌ఖలీలో టీఎంసీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో మమతా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు రెడీ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరిని పార్టీ పదవుల నుంచి తొలగించగా మరికొంత మందిని అరెస్టు చేశారు. ప్రధానంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సందేశ్‌ఖలీలో మహిళలు రోడ్లపైకి వచ్చి మరీ నిరసనలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.