Share News

Dy CM: రాష్ట్రంలో అలజడులకు కుట్ర పన్నుతున్నారు..

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:55 AM

అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Dy CM: రాష్ట్రంలో అలజడులకు కుట్ర పన్నుతున్నారు..

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ధ్వజం

చెన్నై: అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు కిరాణా సరుకులతో కూడిన సంక్షేమ సహాయాలను ఉదయనిధి అందజేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఐదుగురిని బలిగొన్న మద్యం మత్తు..


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత పార్లమెంటుఎన్నికల్లో ఊహించని రీతిలో భారీవిజయాన్ని చూశామని, అలాంటి విజయం మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సాధించేలా డీఎంకే శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. 234 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఏడోసారి కూడా డీంఎకేను అధికారంలో కూర్చోబెట్టాలని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ద్రావిడ మోడల్‌ అంటే ఏమిటని అడుగుతున్నారని, అందరికి సమానంగా ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యమన్నారు.

nani4.2.jpg


తన పుట్టినరోజు సందర్భంగా కలైంజర్‌ స్మారక మందిరంలో విధుల్లో పాల్గొంటున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు మొత్తం 1,335 మందికి సంక్షేమ సహాయాలు అందజేసినట్లు తెలిపారు. కూటమిలో చేరుతున్నవారు రూ.100 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ ఆ పార్టీ క్షేత్రస్థాయి సమావేశంలో బహిరంగంగా ఆరోపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడేలా అన్నాడీఎంకే తరఫున అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సమావేశాలు అలజడులకు దారితీసేలా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచనల మేరకు డీఎంకే ఇప్పటికే ఎన్నికల పనులు ప్రారంభించిందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 11:55 AM