Share News

Hemant Soren: హేమంత్ సోరెన్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఈడీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:32 PM

జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది.

Hemant Soren: హేమంత్ సోరెన్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఈడీ

న్యూఢిల్లీ: జార్ఖాండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. జార్ఖాండ్ ముక్తి మోర్చా చీఫ్‌పై ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాలు లేవని హైకోర్టు పేర్కొనడాన్ని ఈడీ తప్పుపట్టింది.

Jharkhand: కొలువు తీరిన కేబినెట్‌.. చంపాయి సోరెన్‌కు చోటు


భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయిన సోరెన్‌కు జార్ఖాండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో జూన్ 28న ఆయన బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జార్ఖాండ్ సీఎంగా ఉన్న చంపాయి సోరెన్ తన పదవి నుంచి వైదొలిగారు. జేఎంఎం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన హేమంత్ సోరన్ కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నెగ్గడంతో పాటు తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించారు. ఈ క్రమంలో జార్ఖాండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆశ్రయించడంతో ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు హేమంత్ సోరెన్‌తో పాటు జార్ఖాండ్ రాజకీయాలకు కూడా కీలకం కానుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 09:32 PM