Share News

Electoral bonds: బ్యాంకుల ద్వారా రాజకీయ పార్టీలకు ముడుపులు: జైరాం రమేష్

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:05 PM

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానంలో బ్యాంకుల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నగదును బీజేపీ స్వీకరించిందని పేర్కొంది.

Electoral bonds: బ్యాంకుల ద్వారా రాజకీయ పార్టీలకు ముడుపులు:  జైరాం రమేష్

ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధులపై సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ (Congress) పార్టీ డిమాండ్ చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానంలో బ్యాంకుల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అధికారికంగా లంచాలు స్వీకరించారని మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడారు. ఎస్బీఐ అందజేసిన సమాచారంతో భారీ నగదును బీజేపీకి చేరిందని తెలిపారు. 38 కార్పొరేట్ సంస్థలు అధికార భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్లను అందజేసిందని వివరించారు. తర్వాత ఆ సంస్థలకు భారీ మొత్తంలో ప్రాజెక్టులు అందాయని పేర్కొన్నారు. 179 ప్రభుత్వ కాంట్రాక్టులు, 3.8 లక్షల కోట్ల విలువ గల ప్రాజెక్టులు ఆ సంస్థలు పొందాయని జైరాం రమేష్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు పట్టవని మండిపడ్డారు. రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను కల్పించదు. కోట్ల రూపాయల లంచాన్ని లీగల్‌కు తీసుకుంటుంది, అందుకు ప్రతిగా రూ.లక్షల కోట్ల ప్రాజెక్టులను ఇస్తోందని ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 09:05 PM