Jaishankar: శత్రుదేశమైన పాకిస్తాన్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన.. కారణమిదే..
ABN , Publish Date - Oct 04 , 2024 | 08:59 PM
భారత శత్రుదేశమైన పాకిస్తాన్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెలలో పర్యటించనున్నారు. అయితే 2015లో సుష్మా స్వరాజ్ తర్వాత తొలిసారిగా పాక్ వెళుతున్న మంత్రి జైశంకర్ కావడం విశేషం. అయితే ఎందుకు పర్యటిస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) ఈ నెలలో పాకిస్తాన్(Pakistan)లో పర్యటించనున్నారు. త్వరలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ప్రభుత్వాధినేతల (CHG) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇస్లామాబాద్‌లో జరగనున్న ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత బృందానికి విదేశాంగ మంత్రి నాయకత్వం వహిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని శుక్రవారం (అక్టోబర్ 4న) తెలిపారు. విదేశాంగ మంత్రి పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
మోదీకి ఆహ్వానం
లాంఛనప్రాయ ప్రక్రియలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని..భారత ప్రధాని నరేంద్ర మోదీని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే SCO సమావేశాల్లో దేశాధినేతలు పాల్గొనాల్సిన అవసరం లేదు. గతంలో కూడా భారత్ నుంచి మంత్రుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. గత ఏడాది SCO విదేశాంగ మంత్రుల సమావేశం కోసం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారతదేశానికి వచ్చారు. ప్రధాని మోదీకి సహా ఇతర సభ్య దేశాలకు ఆహ్వానం అందించడం అనేది ఏదైనా ఆతిథ్య దేశం అనుసరించే తప్పనిసరి ప్రోటోకాల్ మాత్రమే. పాకిస్తాన్ కూడా ఇక్కడ అదే చేసింది.
ముగిసిన శకం
గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్తాన్ సంబంధాలు చాలా ఉద్రిక్తంగా మారాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్‌తో చర్చల అవకాశాలను ఇటివల ఓ సమావేశంలో తిరస్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చల శకం ముగిసిపోయిందని ఆయన వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 ముగిసిందన్నారు.
గతంలో
ప్రధాని మోదీ చివరగా 2015లో ఆకస్మిక పర్యటన నిమిత్తం లాహోర్ చేరుకున్నారు. అనంతరం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశారు. ఆ తర్వాత 2015 డిసెంబర్‌లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాకిస్తాన్‌లో పర్యటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాని, మంత్రి ఎవరూ కూడా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఉగ్రదాడి
నలుగురు ఉగ్రవాదులు భారత సైనికుల వేషధారణలో వచ్చి ఉరీలోని బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులపై దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్‌లోకి ప్రవేశించి సెప్టెంబర్ 28-29 రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో 38 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
Indias Foreign Exchange Reserves: ఆల్ టైమ్ రికార్డుకు భారత విదేశీ ద్రవ్య నిల్వలు.. ఎంతకు చేరాయంటే..
Nissan Magnite Facelift: రూ. 5.99 లక్షలకే నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్.. దీని స్పెషల్ ఏంటంటే
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్
Read More Business News and Latest Telugu News