Loksabha Polls: తమిళనాడు బీజేపీ చీఫ్‌పై కేసు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:44 PM
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నామలై నిబంధనలను అతిక్రమించారు. దాంతో కేసు నమోదు చేశారు. అన్నామలై కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
చెన్నై: తమిళనాడు (Tamilnadu) బీజేపీ చీఫ్ అన్నామలైపై (Annamalai) పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నామలై నిబంధనలను అతిక్రమించారు. అన్నామలై కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల లోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా అన్నామలై ప్రచారం చేశారు. దాంతో పోలీసులు అన్నామలైపై కేసు నమోదు చేశారు. అన్నామలైతోపాటు కోయంబత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేష్ పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
ఇది కూడా చదవండి:
Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు: సూత్రధారులు అరెస్ట్
మరిన్ని జాతీయ వార్తల కోసం