ED raids: ఎంపీ భూమిని సీజ్ చేసిన ఈడీ, అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:01 PM
ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాద్ పార్టీ జౌన్‌పుర్ ఎంపీ బాబు సింగ్ కుష్వాహపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. లక్నోలోని కాన్పూర్ రోడ్డులోని స్కూటర్ ఇండియాలో కోట్లు విలువచేసే భూమిని స్వాధీనం చేసుకుంది. ఈడీ బృందం బుల్డోజర్‌ను రప్పించి ఆ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది.
జౌన్‌పుర్: ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాద్ పార్టీ (SP) జౌన్‌పుర్ ఎంపీ బాబు సింగ్ కుష్వాహ (Babu Singh Kushwaha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలకు దిగింది. లక్నోలోని కాన్పూర్ రోడ్డులోని స్కూటర్ ఇండియాలో కోట్లు విలువచేసే భూమిని స్వాధీనం చేసుకుంది. ఈడీ బృందం బుల్డోజర్‌ను రప్పించి ఆ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ చర్య తీసుకుంది. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా, బాబు సింగ్ కుష్వాహ మంత్రిగా ఉన్నప్పటి కేసు ఇది.
ఎన్‌ఆర్‌హెచ్ఎం స్కామ్
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. కేంద్రం నిధులను దిగమిందనే ఆరోపణలను మాయవతి ప్రభుత్వం ఎదుర్కొంది. 2010, 2011లో యూపీలోని ఇద్దరు సీఎంఓలు డాక్టర్ వినోద్ ఆర్య, డాక్టర్ బీపీ సింగ్ హత్యకు గురికావడంతో ఈ అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్ కేసులో జైలులో ఉన్న డిప్యూటీ సీఎంఓ డాక్టర్ వైఎస్ సచిన్ జైలులోనే శవమై కనిపించారు. ఎన్‌హెచ్ఆర్ఎం అవినీతి కేసులో బాబు సింగ్ కుష్వాహ నిందితుడుగా ఉండగా, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం
కుష్వాహ రాజకీయ జర్నీ...
అవినీతి ఆరోపణలతో అప్పట్లో కుష్వాహ రాజీనామా చేశారు. పదేళ్ల పాటు ఆయన రాజకీయ కెరీర్ వెనుకబాట పట్టింది. 2024లో సమాజ్‌వాదీ పార్టీ ఆయనకు జౌన్‌పుర్ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఆయన తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం బాబూ సింగ్ కుష్వాహ లోక్‌సభలో సమాజ్‌వాది పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు.
Read Latest Telangana News and National News