Nationa News: బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో విచారణ.. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేత..!
ABN , Publish Date - May 21 , 2024 | 05:58 PM
భారత రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టు బ్రిజ్ భూషణ్ నుంచి బయటకు వస్తుండగా.. తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించింది.
భారత రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టు బ్రిజ్ భూషణ్ నుంచి బయటకు వస్తుండగా.. నేరాభియోగాల నమోదుపై మీడియా ప్రశ్నించింది. తనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని.. వాస్తవం లేదన్నారు. ఆరోపణలు రుజువైతే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలను పోలీసులు కోర్టులో నిరూపించాలన్నారు. నిర్దోషిగా నిరూపించుకోవడానికి తన దగ్గర అవసరమైన ఆధారాలు ఉన్నాయని.. న్యాయస్థానంలో వాటిని బయటపెడతానన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు.
PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ
ఎంపీ టికెట్ రాకపోవడంపై..
మహిళా రెజ్లర్లను వేధించినందుకే ఎంపీ టికెట్ రాలేదా అని అడిగిన ప్రశ్నకు బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ.. తన కుమారుడికే టికెట్ వచ్చిందన్నారు. తన కుటుంబ సభ్యులకు టికెట్ వచ్చినందుకే తాను సంతృప్తిగానే ఉన్నానని అన్నారు. కోర్టులో విచారణ జరుగుతున్న కేసు గురించి ప్రశ్నించగా.. ఇవన్నీ తప్పుడు కేసులని అన్నారు. తనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆధారాలతో నిరూపించాలని.. తాను ఏ తప్పు చేయలేదనడానికి ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు.
400 సీట్లపై..
ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటుతాయా అని అడిగిన ప్రశ్నకు బ్రిజ్ భూషణ్ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం రాజకీయాలపై స్పందించే సమయం కాదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ప్రస్తుతం ఈకేసు న్యాయస్థానం పరిధిలో ఉందని.. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనపై మోపిన అభియోగాలను తాను అంగీకరించబోనని చెప్పారు.
అసలు కేసు ఏమిటంటే..
తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఆరుగురు రెజ్లర్లు ఆరోపించడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354ఏ, 506/1 కింద కోర్టు అభియోగాలు నమోదయ్యాయి. రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ నేతృత్వంలో విచారణ జరిగింది.
Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News