Share News

Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్

ABN , Publish Date - Aug 29 , 2024 | 08:09 AM

సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి ఈ విధంగా ఎద్దుల బండిపై ప్రయాణించారని బీజేపీ వెల్లడించింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో సీఎం సైనీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్రమంలో రైతులు, దళితులు, పేదల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.

Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్
Haryana Chief Minister Nayab Singh Saini

ఛండీగఢ్, ఆగస్ట్ 28: హరియాణా అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఓటర్ల మూడ్ ఎలా ఉందనే అంశంపై ఆ రాష్ట్ర సీఎం నయాబ్ సింగ్ సైనీ దృష్టి సారించారు. అందులోభాగంగా బుధవారం జింద్ జిల్లాలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం సైనీ ఎడ్ల బండిని తొలుతూ.. ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పరిపాలనతోపాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఎడ్ల బండిపై కూర్చున్న ఇద్దరు మహిళలను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో సీఎం సైనీ పోస్ట్ చేశారు.


అందుకోసమే సీఎం ఇలా...

సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి ఈ విధంగా ఎద్దుల బండిపై ప్రయాణించారని బీజేపీ వెల్లడించింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో సీఎం సైనీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్రమంలో రైతులు, దళితులు, పేదల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.


స్పందించిన కాంగ్రెస్ పార్టీ ..

ఇక హరియాణా సీఎం సైనీ వ్యవహార శైలిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీఎం షైనీ చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కగా అభివర్ణించింది. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటు తీవ్రంగా ఉన్నాయి. అయినా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపేంద్ర హుడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


అధికారం కోసం ఆప్ యత్నం...

ఇక పక్కనే ఉన్న పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. హరియాణలో సైతం అధికారం అందుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. అందులోభాగంగా ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే బీజేపీ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. శాంతి భద్రతలు, నిరుద్యోగంతోపాటు అగ్నిపథ్ పథకం వల్ల నష్టాలను ప్రజల మధ్యకు వెళ్లి ఆప్ నేతలు వివరిస్తున్నారు.


కేజ్రీవాల్ కీ 5 గ్యారంటీ పేరుతో..

ఇక ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్న ఆప్... కేజ్రీవాల్ కీ 5 గ్యారంటీ పేరుతో ప్రజల మధ్య వెళ్లింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఉచిత విద్యా, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి రూపాయిలు ఇస్తామని ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తుంది. మొత్తం 90 మంది సభ్యులు ఉన్నా హరియాణా అసెంబ్లీకి.. ఆక్టోబర్ 1వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4వ తేదీన వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 08:11 AM