Share News

Exit Polls: హర్యానా సీఎం అభ్యర్థి ఎవరంటే.. హుడా కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - Oct 05 , 2024 | 07:00 PM

హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేయగా.. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీ కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి.

Exit Polls: హర్యానా సీఎం అభ్యర్థి ఎవరంటే.. హుడా కీలక వ్యాఖ్యలు..
Hooda and Selja

Live News & Update

  • 2024-10-05T20:06:36+05:30

    హర్యానా సీఎం అభ్యర్థిపై హుడా కీలక వ్యాఖ్యలు..

    • హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. సర్వే సంస్థల అంచనాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా సీఎం అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    • ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందన్నారు.

    • కుమారి షెల్జా సీనియర్ నాయకురాలని, సీఎం పదవిని ఆశించే హక్కు ఆమెకు ఉందన్నారు

    • షెల్జాతో పాటు చాలామంది సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారన్నారు.

    • ఎంతఎక్కువమంది అభ్యర్థులు సీఎం రేసులో ఉంటే పార్టీ అంత బలపడుతుందన్నారు.

    • హైకమాండ్ నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని హుడా తెలిపారు.

  • 2024-10-05T19:44:13+05:30

    జమ్మూ, కశ్మీర్ ఫలితాలపై సర్వే సంస్థల అంచనా

    • జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థల అంచనా

      దైనిక్ భాస్కర్

      • బీజేపీ 20-25, కాంగ్రెస్-ఎన్సీ కూటమి 35-40, పీడీపీ 4-7, ఇతరులు 12-16

        ఇండియా టుడే-సీ ఓటర్

      • బీజేపీ 27-32, కాంగ్రెస్-ఎన్సీ కూటమి 40-48, పీడీపీ 6-12, ఇతరులు 6-11

        పీపుల్స్ పల్స్

      • బీజేపీ 23-27, కాంగ్రెస్-ఎన్సీ కూటమి 46-50, పీడీపీ 7-11, ఇతరులు 4-6

  • 2024-10-05T19:24:47+05:30

    హర్యానా ఫలితాలపై ధృవ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా..

    • కాంగ్రెస్ 50-64, బీజేపీ 22-32, ఇతరులు 2-8

    • ఐఎన్‌ఎల్‌డి, ఆప్ ఖాతా తెరవవని ధృవ సంస్థ అంచనా

      పీపుల్ పల్స్ అంచనా

    • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా

    • కాంగ్రెస్ 46-61, బీజేపీ 20-32, ఇతరులు 3-5

    • ఐఎన్‌ఎల్‌డి 2-3, జేజేపీ 0-1

      మ్యాట్రిస్ సంస్థ అంచనాలు..

    • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా

    • కాంగ్రెస్ 55-62, బీజేపీ 24-28

      దైనిక్ భాస్కర్ అంచనా..

      • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చేసిన దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్‌

      • కాంగ్రెస్ 44-54, బీజేపీ 12-19

      • ఐఎన్‌ఎల్‌డి 1-5, జేజేపీ 0-1

  • 2024-10-05T19:12:10+05:30

    హర్యారాలో కాంగ్రెస్ గాలి..

    • హర్యానాలో కాంగ్రెస్ గాలి వీచిందన్న కేకే

    • క్లీన్‌స్వీప్ చేస్తుందని అంచనా

    • బీజేపీ గ్రాఫ్ భారీగా తగ్గిందన్న కేకే

  • 2024-10-05T19:10:15+05:30

    హర్యానా ఫలితాలపై కేకే ఫైనల్ నెంబర్

    • 90 సీట్లలో కాంగ్రెస్ 75 సీట్లు గెలుస్తుందన్న కేకే

    • బీజేపీ 11 సీట్లు గెలుచుకుంటుందన్న కేకే సర్వే

    • ఇండిపెండెంట్లు, ఇతర పార్టీ అభ్యర్థులు నాలుగు సీట్లలో విజయం సాధిస్తారన్న కేకే

  • 2024-10-05T19:08:02+05:30

    సోనిపట్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

    • సోనిపట్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందన్న కేకే సర్వే

    • ఆరు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందన్న కేకే

  • 2024-10-05T19:05:33+05:30

    పంచకులలో బీజేపీకి ఎదురుదెబ్బ

    • పంచకులలో రెండు సీట్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న కేకే

    • బీజేపీ ఖాతా తెరవదన్న కేకే

    • పానిపట్‌లో కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు సీట్లలో గెలుస్తుందన్న కేకే

  • 2024-10-05T19:02:24+05:30

    కాంగ్రెస్ క్లీన్ స్వీప్

    • పల్వాల్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న కేకే

    • మూడు సీట్లలో హస్తం పార్టీ గెలుస్తుందని అంచనా

  • 2024-10-05T19:00:39+05:30

    హర్యానా ఫలితాలపై కేకే సర్వే..

    • హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ విడుదల

    • కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందన్న కేకే సర్వే

    • జిల్లాల వారీ ఎగ్జిట్ పోల్స్ విడుదల

    • అంబాలాలో నాలుగు సీట్లకు మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న కేకే

    • అంబాలాలో బీజేపీ ఖాతా తెరవదన్న కేకే

    • చాలా జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవదన్న కేకే