Lok Sabha Elections: వద్దనుకున్నా.. కానీ.. కంగనాపై పోటీకి రెడీ అంటున్న మాజీ సీఎం భార్య..
ABN , Publish Date - Mar 26 , 2024 | 08:58 AM
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్(Kangana Ranaut)ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య అయిన ప్రతిభా సింగ్ మూడు సార్లు ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. వీరభద్ర సింగ్ సైతం ఇదే లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. కంగనా రనౌత్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రతిభా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే కంగనాపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
BJP vs Congress: వాయనాడ్ లోనూ అమేథీ పరిస్థితే.. రాహుల్ పై బీజేపీ సంచలన కామెంట్స్..
కంగనా ప్రకటనతో..
కంగనాను మండి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ప్రతిభా సింగ్‌కు మండి ప్రాంతంలో మంచి పేరుంది. కాగా.. ఈ ఎన్నికల్లో మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని హైకమాండ్‌కు తన కోరిక చెప్పానన్నారు. కంగనా రనౌత్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలిపారు. హైకమాండ్ పోటీ చేసే బాధ్యత అప్పగిస్తే, తాను వెనక్కి తగ్గబోనన్నారు. ఈ విషయంలో తుది చర్చ జరగలేదని,హైకమాండ్ నిర్ణయం ఏదైనా గౌరవిస్తానని ప్రతిభా సింగ్ వెల్లడించారు.
Kangana Ranaut: కంగనాపై అభ్యంతరకర పోస్టు.. మహిళా కమిషన్ సీరియస్.. ఎన్నికల సంఘానికి లేఖ
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..