Elections 2024: భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన రాజకీయం.. ఆ కారణంతో దూరం..
ABN , Publish Date - Apr 07 , 2024 | 09:34 AM
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల్లో ( Lok Sabha Elections ) విజయం సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు విమర్శలు, ఆరోపణలతో సాగిపోతున్నారు. ఘాటు కామెంట్లతో మండు వేసవిలో మరింత వేడి పుట్టిస్తున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల్లో ( Lok Sabha Elections ) విజయం సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు విమర్శలు, ఆరోపణలతో సాగిపోతున్నారు. ఘాటు కామెంట్లతో మండు వేసవిలో మరింత వేడి పుట్టిస్తున్నారు. రాజకీయం అంటేనే ఓ యుద్ధం. వ్యూహాలకు పదును పెడుతూ, కార్యకర్తలు, పార్టీ నేతల సహాయ సహకారాలు ఉంటేనే విజయం సాధిస్తారు. ఎలక్షన్లలో విభిన్న పార్టీల నుంచి ఒకే ఇంటికి చెందిన వ్యక్తులు పోటీ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. అన్నా తమ్ముడు, తల్లీ కుమారుడు, భార్యా భర్త ఇలా బంధమేదైనా వారు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారంటే ఎన్నికల క్రతువు రసవత్తరం కావాల్సిందే.
TG Politics: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?
కానీ.. ఎన్నికల ప్రక్రియ ఓ కుటుంబాన్ని విడదీసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ లో జరిగింది. ఈ లోక్‌సభ నియోజకవర్గానికి బీఎస్పీ నుంచి భర్త, భార్య కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో భిన్న సిద్ధాంతాలున్న ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో నివసిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తాయని వారు భయపడ్డారు. దీంతో ఎన్నికలయ్యేవరకూ ఇంటికి రానంటూ భర్త డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ 19న పోలింగ్ ముగిశాకే ఇంటికి వెళ్తానని స్పష్టం చేశారు.
ఆయన సమీపంలోని ఓ పూరింట్లో నివసిస్తూ ప్రచారం చేస్తు్న్నారు. కంకర్ ముంజరే, అనుభా ముంజరే దంపతుల విచిత్ర పరిస్థితి ఇది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బైసన్‌పై అనుభా విజయం సాధించి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. భర్త తీసుకున్న నిర్ణయంతో అవాక్కైన ఆమె.. 33 ఏళ్లుగా తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగిందని, ఎన్నికల సమయంలో తన భర్త గురించి చెడుగా మాట్లాడమని అనుభా వెల్లడించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.