Pokhran: యుద్ధ విమానం నుంచి జారిపడిన ‘ఎయిర్ స్టోర్’
ABN , Publish Date - Aug 22 , 2024 | 05:49 AM
భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్ జెట్) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్ స్టోర్’ తీవ్ర కలకలం రేపింది.
పోఖ్రాన్, ఆగస్టు 21: భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్ జెట్) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్ స్టోర్’ తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్‌లోని ఽథార్ ఎడారి సమీపంలో ఉన్న పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ఫైటర్ జెట్ నుంచి బుధవారం ‘ఎయిర్ స్టోర్’ అకస్మాత్తుగా జారిపడింది. దీంతో ఒక్కసారిగా వెలువడిన అతి భారీ శబ్దాలు కిలో మీటరు దూరంలోని గ్రామస్థులను భీతిల్లేలా చేశాయి.
వారంతా రామ్‌దేవ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఆశ్రయించారు. ‘ఎయిర్ స్టోర్’ జారిపడిన ఘటనపై వైమానిక దళం వెంటనే స్పందించింది. ఈ ఘటన సాంకేతిక లోపంతో అనుకోకుండా జరిగిందని, ఎవరికీ ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. దీనిపై ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ’కి ఆదేశించినట్టు తెలిపింది.
యుద్ధ విమానాల కింది భాగం(అండర్ బెల్లీ)లోని హార్డ్ పాయింట్లకు ఏర్పాటు చేసిన పరికరాలు, ఆయుధాలనే ఎయిర్‌స్టోర్ అంటారు. ఒక రకంగా స్టోర్ రూమ్ లాంటిది. యుద్ధ సమయాల్లో ఎయిర్ స్టోర్లలోని ఆయుధాలను సంబంధిత లక్ష్యాలపై జార విడుస్తారు.