Share News

Indian Air Force: 13,500 కోట్లతో 12 సుఖోయ్‌ యుద్ధ విమానాలు

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:44 AM

భారతీయ వాయు సేన కోసం 12 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించింది.

Indian Air Force: 13,500 కోట్లతో 12 సుఖోయ్‌ యుద్ధ విమానాలు

  • హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం

న్యూఢిల్లీ, డిసెంబరు 12: భారతీయ వాయు సేన కోసం 12 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించింది. ఇందుకు రూ.13,500 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో గురువారం ఒప్పందం కుదుర్చుకొంది. రష్యాకు చెందిన ఈ యుద్ధ విమానాల పరికరాల్లో 62.6 శాతం మేర భారత్‌లోనే తయారుకానున్నాయి. ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన మేరకు హెచ్‌ఏఎల్‌ వీటిని నిర్మించనుంది. నాసిక్‌లోని కర్మాగారంలో వీటిని తయారు చేయనున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 05:44 AM