Share News

Jharkhand Assembly Elections: జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:09 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారంనాడు ప్రకటించారు.

Jharkhand Assembly Elections: జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) 'ఇండియా' (INDIA) కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని, మొత్తం 81 సీట్లలో 70 సీట్లలో జేఎంఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రకటించారు. తక్కిన 11 సీట్ల విషయంలో భాగస్వామ్య పార్టీలైన ఆర్జేడీ, వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. హేమంత్ సోరెన్, జార్ఖాండ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ శనివారంనాడు మీడియా సమావేశంలో పొత్తుల విషయాన్ని వెల్లడించారు.

Maharashtra: 'మహాయుతి' కూటమి సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదే.. సీఎం ఆయనే


జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి. నవంబర్ 13న తొలివిడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 13న ఫలితాలు వెలువడతాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామి అయిన ఏజేఎస్‌యు జాతీయ ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజాక్, హ్యాట్రిక్ బీజేపీ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జేఎంఎంలో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. 2019లో మహువా నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన హజ్రా.. కాంగ్రెస్ అభ్యర్థి మంజు కుమారిపై 18,175 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మంజు కుమారి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడం, ఆమెకు మహువా నుంచి టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో బీజేపీని హజ్రా వీడారు. జేఎంఎంలో చేరారు. తిరిగి మహువా నుంచి జేఎంఎం టిక్కెట్‌పై ఆయన బరిలోకి దిగనున్నారు. జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉమాకాంత్ రజాక్, కేదార్ హజ్రాలు జేఎంఎంలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని హేమంత్ సోరెన్ తెలిపారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

Updated Date - Oct 19 , 2024 | 04:09 PM