Share News

Lok Sabha Speaker Election: దేశ చరిత్రలో తొలిసారి.. లోక్ సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:32 PM

లోక్ సభ స్పీకర్ పదవికి(Lok Sabha Speaker Post) ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్(Congress) భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.

Lok Sabha Speaker Election: దేశ చరిత్రలో తొలిసారి.. లోక్ సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ

ఢిల్లీ: లోక్ సభ స్పీకర్ పదవికి(Lok Sabha Speaker Post) ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, భాగస్వామ్య పార్టీలకు విపక్ష కాంగ్రెస్(Congress) పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నప్పటికీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టింది.

కేరళ నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచిన కొడికున్నిల్ సురేశ్‌ను ఇండియా కూటమి (INDIA Alliance) స్పీకర్ అభ్యర్థిగా హస్తం పార్టీ ప్రటించింది. ఆయన మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి అప్పగించాలన్న సంప్రదాయాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలైంది.


డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటివరకు జరిగిన లోక్ సభ స్పీకర్ పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కాగా 75 ఏళ్ల దేశ చరిత్రలో లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండడం ఇదే తొలిసారి కానుంది.


అంతలోనే మార్పు..

తొలుత స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం అవుతుందని భావించారు. కానీ స్పీకర్‌ ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ మెలిక పెట్టింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇండియా కూటమి సభ్యులతో జరిపిన చర్చల్లో.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షాలకు ఇస్తే స్పీకర్‌‌కి మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ అనూహ్యంగా అభ్యర్థిని పోటీలో నిలిపింది.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 01:04 PM