రాజాంకు రైల్వే లైను వేయండి: కలిశెట్టి
ABN , Publish Date - Jul 30 , 2024 | 04:33 AM
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్‌ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్‌ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో తొలిసారిగా సోమవారం ప్రసంగించిన ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని కోరారు.
విలేకరులకు రైల్వే పాసులివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశరాజధాని ఢిల్లీలో వరద ముంపునకు గురై మరణించిన సివిల్స్ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.