Share News

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:43 PM

మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు.

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ (MUDA) కుంభకోణంలో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు. హుడా భూముల కేటాయింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు అధికారుల ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముడా కమిషనర్ రఘనందన్ సహా పలువురు అధికారులను దర్యాప్తు బృందం కలిసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Dera Baba: డేరా బాబాకు సుప్రీం షాక్


సెంట్రల్ పారామిలటరీ పోలీసుల భద్రతతో ఈడీ అధికారులు ముడా కార్యాలయంతో పాటు మైసూరులోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే మఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కానీ, వారి సంబంధీకుల ఇళ్లలో కానీ సోదాలు జరపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండ్రోజుల క్రితం ముడా అథారిటీ చైర్మన్ కె.మరిగౌడ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనమైంది. సిద్ధరామయ్యకు ఆయన సన్నిహితుడనే పేరుంది. అనారోగ్యం కారణంగానే మరిగౌడ రాజీనామా చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


కేసు పూర్వాపరాలు

ముడాకు చెందిన 14 స్థలాలను సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కేటాయించడంపై ముఖ్యమంత్రి కొద్దికాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతించడం సంచలనమైంది. దీనిపై సిద్ధరామయ్య హైకోర్టులో సవాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే లోకాయుక్త పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది పేర్లు చేర్చారు. ముడా స్కామ్ ఆరోపణలతో తన ప్లాట్లను సిద్ధరామయ్య భార్య తిరిగి ముడాకు అప్పగించారు. తనపై వచ్చిన ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు బనాయించారని చెబుతున్నారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 04:25 PM