Karnataka High Court : తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై కేసు పెట్టుకోవచ్చు
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:31 AM
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని ఓ భర్తకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది.
అనుమతి ఇచ్చిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరు, జూన్ 30: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని ఓ భర్తకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది. భర్త తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ 2022లో బసవనగుడి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసు హైకోర్టు జడ్జి జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఛార్జిషీటును, ఇతర వాంగ్మూలాలను పరిశీలించిన ఆమె ఈ కేసును కొట్టివేశారు. భార్యవి తప్పుడు ఆరోపణలని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసినందున అవసరమైతే భర్త ఆమెపై కేసు పెట్టవ చ్చన్నారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ఆ జంట 2020 మే 29న వివాహం చేసుకుంది. హెచ్1బీ వీసా నవీకరణ కోసం 2 నెలలకే భర్త 2 అమెరికా వెళ్లిపోయాడు. కొన్ని కారణాల వల్ల మరుసటి ఏడాదే 2021లో విడాకుల కోసం అతడు దరఖాస్తు చేశాడు. కానీ, అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టింది.