Share News

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:25 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)కు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు (CBI Court) జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలను ఢిల్లీ పోలీసు (Delhi Police) యంత్రాంగం రంగంలోకి దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నేడు ధర్నాలు నిర్వహించే అవకాశం అవకాశం ఉంది.

Arvind Kejriwal arrest: కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి మద్దతు.. నేడు కుటుంబ సభ్యులను కలవనున్న రాహుల్

కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొనాలని ఆప్ కోరింది. కాగా.. నిన్న రాత్రి ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. ఈ పరిణామాలతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఆప్ అధినేత అరెస్టు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్ తెలిపింది. అయితే ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!

కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది. వాటిని సీఎం పట్టించుకోలేదు. దీంతో ఈడీ సెర్చ్ వారెంట్‌తో గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి వచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లింది. అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఆప్ ఖండించింది. ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన కుట్ర అని అభివర్ణించింది. అరెస్టు అయినా ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేస్తారని, అవసరం అయితే జైలు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుని వారం రోజులు కూడా గడవకముందే కేజ్రీవాల్ అరెస్ట్ కావడం గమనార్హం.

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Mar 22 , 2024 | 08:25 AM