Share News

Kerala High Court : బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తింపు

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:40 AM

బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తిస్తందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.

 Kerala High Court : బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తింపు

  • మినహాయింపులు లేవు.. కేరళ హైకోర్టు స్పష్టీకరణ

కోచి, జూలై 28: బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తిస్తందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది. తొలుత అందరూ భారత పౌరులని, ఆ తరువాతే ఆయా మతాల సభ్యులని పేర్కొంది.

బాల్య వివాహాన్ని చేయించారన్న కారణంతో 2012లో పాలక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.కున్హికృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం రజస్వల అయిన తరువాత అంటే 15 ఏళ్లు నిండిన తరువాత బాలికను పెళ్లి చేయవచ్చని, ఇది బాల్య వివాహం పరిధిలోకి రాదని పిటిషనర్‌ వాదించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం అన్ని మతాల వారికి వరిస్తుందని తెలిపారు. బాలికలకు పెళ్లి చేయడం అంటే విద్య, ఆరోగ్యం వంటి వారి ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 03:40 AM