అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:40 AM
ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
చెప్పేవారికి మిలియన్ డాలర్ల బహుమతి
ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నున్ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జరిపే విదేశీ పర్యటనలపై ముందుగా సమాచారం ఇస్తే ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.50 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. నవంబరు 26 నుంచి సీఆర్‌పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని ఓ ప్రకటనలో హెచ్చరించాడు. సీఆర్‌పీఎఫ్ దారుణాలకు పాల్పడుతున్నందున ఆ పాఠశాలలను బహిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరాడు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పాఠశాల బయట ఇటీవల బాంబు పేలిన సంఘటన నేపథ్యంలో పన్నున్ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకొంది.