Exit Poll 2024: అదే జరిగితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే సంచలన ప్రకటన..
ABN , Publish Date - Jun 02 , 2024 | 03:54 PM
Lok Sabha Election Results: శనివారం సాయంత్రం విడుదలైన దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు(Exit Poll Results) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే(NDA) మెజార్టీని ఇచ్చాయి. దాదాపు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు.
Lok Sabha Election Results: శనివారం సాయంత్రం విడుదలైన దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు(Exit Poll Results) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే(NDA) మెజార్టీని ఇచ్చాయి. దాదాపు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి కీలక ప్రకటన చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ అని కొట్టిపడేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఈ ఫలితాలన్నీ తప్పు అనే తేలుతాయన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు సోమ్‌నాథ్ భారతి.
2019లో కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఏడు స్థానాల్లో కనీసం ఆరు స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని అంచనా వేశాయని.. ఇప్పుడూ అలాగే చెప్పారని గుర్తు చేశారు సోమ్‌నాథ్ భారతి. ఢిల్లీలో ఏడు స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఆప్ 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకుని మొత్తం 7 స్థానాలు ఇండియా కూటమి ఖాతాలో పడతాయన్నారు.
‘నా మాట గుర్తుపెట్టుకోండి. జూన్ 4వ తేదీన ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అని తేలుతాయి. మోదీ మరోసారి ప్రధాని కాలేరు. ఢిల్లీలో మొత్తం ఏడుస్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంటుంది. మోదీ మరోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటాను’ అని సోమ్‌నాథ్ భారతి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘కౌంటింగ్ వరకు వేచి ఉండండి. మోడీకి భయపడి ఎగ్జిట్ పోల్‌లు ఆయనకు అనుకూలంగా ఇచ్చారు. అందుకే మనందరం జూన్ 4వ తేదీన రానున్న వాస్తవ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ బీజేపీ తరఫున తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈమైపై ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి కంటెస్ట్ చేస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికల సర్వే సంస్థలు ఎన్డీయే కూటమికి అనకూలంగా ఫలితాలను ఇచ్చాయి. దాదాను అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికి 340 పైగా సీట్లు వస్తాయని చెప్పాయి. ఇదే సమయంలో ఇండియా కూటమికి 150 సీట్ల లోపు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.