Share News

Lok Sabha elections: బీహార్‌లో బీజేపీ, జేడీయూ డీల్ ఫైనల్... ఎవరికి ఎన్నెన్నంటే..?

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:26 PM

బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్‌కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు.

Lok Sabha elections: బీహార్‌లో బీజేపీ, జేడీయూ డీల్ ఫైనల్... ఎవరికి ఎన్నెన్నంటే..?

పాట్నా: బీహార్‌ (Bihar)లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ (BJP) పోటీ చేయనుండగా, నితీష్‌కుమార్ (Nitish Kumar) సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ (JDU) 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు. ఎన్డీయే మరో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 5 సీట్లలో పోటీ చేయనుంది. హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా చెరో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి.


'ఇండియా' కూటమి రూపకర్తల్లో ఒకరిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ గత జనవరి ప్రథమార్థంలో తిరిగి ఎన్డీయే గూటికి చేరుకున్నారు. ఇక ఎప్పటికీ ఎన్డీయేతోనే ఉంటానని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బీహార్‌లో ఏడు విడతల్లో.. మార్చి 19.26, మే 7,13,20,25, జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - Mar 18 , 2024 | 06:26 PM