Narendra Modi: రామ్ లల్లాపై సూర్య తిలకం..ప్రధాని మోదీ వీక్షణ
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:04 PM
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు.
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తి పరవశంతో ప్రధాని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్నాయి.
ఆ చిత్రంలో మోదీ తీక్షణగా రాంలాలా వీడియో చూస్తూ తన కుడి చేతిని హృదయంపై పెట్టుకుని స్మరించుకున్నట్లుగా అనిపిస్తుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోం చేరుకున్న క్రమంలో ప్రధాని మోదీ ర్యాలీ తర్వాత హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో కొంత సమయం వెచ్చించి రాంలాలాను దర్శించుకున్నారు. అంతేకాదు వీక్షణకు ముందు ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా(social media) ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ(modi) దర్శన్ చిత్రాలను పంచుకున్నారు. అందులో ప్రధాని రాంలాలా దర్శనం చేసుకోవడం చూడవచ్చు. అసోంలోని నల్బరీ సమావేశం తరువాత అయోధ్య(ayodhya)లో రామలాలా సూర్య తిలకం అపూర్వమైన క్షణాన్ని చూసే అవకాశం తనకు లభించిందని ప్రధాన పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల వలె, ఇది నాకు చాలా భావోద్వేగ క్షణం. అయోధ్యలో గొప్ప రామనవమి చారిత్రాత్మకమైనది. ఈ సూర్య తిలకం శక్తిని కలిగిస్తుంది. మన జీవితాలు, అది మన దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్దం లెన్స్‌తో రామ్‌లాలాపై సూర్య తిలకం ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చూడండి:
మాకు సంబంధం లేదు.. మేము పట్టించుకోం..: మోదీ వ్యాఖ్యలపై మాథ్యూ మిల్లర్
Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర
మరిన్ని జాతీయ వార్తల కోసం