Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్
ABN , Publish Date - Aug 18 , 2024 | 04:04 AM
పార్లమెంట్‌లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: పార్లమెంట్‌లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు. 2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ వ్యయానికి సంబంధించి ఈ కమిటీ ఆడిట్ నిర్వహిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ నుంచి 29 మంది సభ్యులు ఇందులో ఉంటారు. నలుగురు తెలుగు ఎంపీలకు ఈ కమిటీలో స్థానం లభించింది. లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, జనసేన నుంచి ఎంపీ బాలశౌరీ అలాగే రాజ్యసభ నుంచి డా.కె లక్ష్మణ్‌లకు అవకాశం దక్కింది. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సీనియర్ ఎంపీ పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అధీర్ రంజన్ చౌధురి గత చైర్మన్‌గా ఉన్నారు.