బెయిల్‌పై వచ్చి భార్య, ముగ్గురు బిడ్డల్ని చంపి ఆత్మహత్య!
ABN , Publish Date - Nov 06 , 2024 | 04:22 AM
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
న్యూఢిల్లీ, నవంబరు 5: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసిలో బైధానీ ప్రాంతానికి చెందిన రాజేంద్రగుప్తా(45) అనే వ్యక్తి 1997 నాటి ఓ హత్య కేసులో నిందితుడు. అతడు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య నీతూ గుప్తా(43), కుమారులు నవనేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)లను రాజేంద్ర గుప్తా కాల్చి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టణంలోనే మరో ప్రాంతంలో రాజేంద్రగుప్తా కూడా బుల్లెట్ గాయంతో చనిపోయి పడి ఉన్నాడు. రాజేంద్ర భార్యాబిడ్డల్ని చంపి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేశారు.