Share News

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:38 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

Also Read: Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం


అందులోభాగంగా పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఈ రోజు పచ్చ జెండా ఊపనుందని సమాచారం. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ. 12500 కోట్ల ప్రతిపాదనలకు పబ్లిక్ ఇన్వెస్టమెంట్‌ బోర్డ్ ఆమోదం తెలిపిన విషయం విధితమే. దీంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంతోపాటు ఈ ఏడాది నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు ఈ మొదటి దశ ప్యాకేజీ నిధులు వినియోగించనున్నారు.

Also Read: Jammu Kashmir Assembly Polls: తండ్రి తరఫున నామినేషన్ వేసిన సుగ్రా బర్కతి

Also Read: Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్


ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అందులోభాగంగా ఈ రెండు అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వివిధ శాఖల కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలుమార్లు కలిసి విజ్జప్తులు చేశారు.

Also Read: Dengue Fever: డెంగ్యూ .. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త


దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించింది. దీంతో రాజధానికి, ప్రాజెక్ట్‌కు కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కలిసి సీఎం చంద్రబాబు కోరిన విషయం విధితమే. అదీకాక.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు.. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలబడతామంటూ ఆ వేళ.. మోదీ, షా ద్వయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 28 , 2024 | 11:54 AM