Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:03 PM
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరి పేర్లు మారే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కింద పేర్కొన్న ఎంపీలు కేంద్రమంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిలో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
PM Modi: కొలిక్కి వచ్చిన కేంద్ర మంత్రి మండలి.. మంత్రులకు ప్రధాని తేనీటి సమావేశం
మంత్రివర్గంలో వీళ్లే..
రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, లాలన్ సింగ్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర ఖాటిక్, జుయల్ ఓరమ్, చిరాగ్ పాస్వాన్, కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), బండి సంజయ్(కరీంనగర్) హెచ్డి కుమారస్వామి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, రావ్ ఇందర్జిత్, గిరిరాజ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, . అన్నపూర్ణా దేవి, కిషన్ పాల్ గుజ్జర్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, అశ్వనీ వైష్ణవ్, మార్గరెట్ అల్వా, నిత్యానంద్ రాయ్, సుకాంత్ మజుందార్, అనుప్రియా. పాటిల్, అన్నామలై, జితిన్ ప్రసాద్, జితేంద్ర సింగ్, కె.రామ్ మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), శ్రీనివాసవర్మ(నరసాపురం), శివరాజ్ చౌహాన్, సర్బానంద సోనోవాల్, రామ్నాథ్ ఠాకూర్, సంజయ్ సేథ్, రక్షా ఖడ్సే, సిపి మోహన్, వీరేంద్ర కుమార్, అజయ్ తమ్తా, ఖర్ష్ మల్హోత్రా పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తుది జాబితాలో వీరిపేర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Modi 3.0 Cabinet: కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News