Lok Sabha Polls: క్లీన్ స్వీప్ ఖాయం: ఉదయనిధి స్టాలిన్
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:57 PM
తమిళనాడులో 'ఇండియా' కూటమి 'క్లీన్ స్వీప్' సాధించడం ఖాయమని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారంనాడు పోలింగ్ జరుగుతోంది.
చెన్నై: తమిళనాడులో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి 'క్లీన్ స్వీప్' సాధించడం ఖాయమని డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ (Udhaynidhi Stalin) అన్నారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారంనాడు పోలింగ్ జరుగుతోంది. చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతటా తాను పర్యటించానని, ఓటర్ల నాడి డీఎంకేకు అనుకూలంగా ఉందని, ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకోవడం (క్లీన్ స్వీప్) ఖాయమని చెప్పారు.
PM Modi: కొత్త ఓటర్లకు మోదీ కీలక సందేశం
ఓపీఎస్ జోస్యం ఏమిటంటే?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రామనాథపురం లోక్‌సభ అభ్యర్థి ఓ.పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును థేనిలో ఉపయోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి కచ్చితంగా గెలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలులు వీస్తున్నాయని, ఆన్నాడీఎంకే పార్టీ తిరిగి తన చేతికి వస్తుందని చెప్పారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఓపీఎస్ పోటీ చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 39 సీట్లకు 38 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది.