Share News

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:35 AM

మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే)-ఎ్‌ససీపీ (అజిత్‌) పార్టీల కూటమి అయిన ‘మహాయుతి’ ఘనవిజయం సాధించింది.

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

  • పోటీ చేసిన 9 స్థానాల్లోనూ గెలుపు

ముంబై, జూలై 12: మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే)-ఎస్‌సీపీ(అజిత్‌) పార్టీల కూటమి అయిన ‘మహాయుతి’ ఘనవిజయం సాధించింది. పోటీ చేసిన మొత్తం తొమ్మిది స్థానాలను దక్కించుకొంది. మొత్తం 11 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

విపక్ష కూటమి అయిన కాంగ్రె్‌స-శివసేన (ఠాక్రే), ఎస్‌సీపీ (శరద్‌)ల మహా వికాస్‌ అఘాడీ రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింట్లోనూ గెలిచింది. 11వ స్థానానికి ఎన్‌సీపీ (శరద్‌) మద్దతుతో పోటీ చేసిన పీజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ అభ్యర్థి జయంత్‌ పాటిల్‌ ఓడిపోయారు. పార్టీ ఆదేశాలను కాదని ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 30 మంది తొలి ప్రాధాన్యత కింద పార్టీ అభ్యర్థి ప్రద్న సాతవ్‌కు ఓటు వేయాలని నిర్ణయించారు. మిగిలిన ఏడుగురు శివసేన అభ్యర్థి మిలింద్‌ నర్వేకర్‌కు వేయాలని పార్టీ సూచించింది. అయితే సాతవ్‌కు 25, నర్వేకర్‌కు 22 ఓట్లు మాత్రమే రావడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 03:35 AM