Share News

National: మిత్రపక్షాలతో ఎన్నికల ముందు బీజేపీకి కొత్త తలనొప్పి..

ABN , Publish Date - Aug 24 , 2024 | 09:56 PM

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

National: మిత్రపక్షాలతో ఎన్నికల ముందు బీజేపీకి కొత్త తలనొప్పి..
Chirag Paswan

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గెలుపు కోసం తనదైన వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఎన్టీయేలోని మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తాము ఎన్నికల బరిలో ఉంటామని సవాల్ విసురుతున్నారు. సీట్ల సర్ధుబాటు విషయంలో గట్టిగా ఉండేందుకు ముందునుంచే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తొందరపాటు ప్రకటనలు చేయవద్దని పార్టీ అధిష్టానం నాయకులకు సూచించింది.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి


జార్ఖండ్‌పై పార్టీల ఫోకస్..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టాయి. పొరుగు రాష్ట్రమైన బీహార్‌లో ప్రభావం చూపే ఎన్‌డిఎలో భాగస్వామ్యపక్షాలు జార్ఖండ్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూతో పాటు జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా-హమ్ పార్టీ, లోక్‌జనశక్తి పార్టీలు జార్ఖండ్‌లో పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈక్రమంలో ఎల్‌జేపీ (రామ్ విలాస్) పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆగస్టు 25న జార్ఖండ్ రాజధాని రాంచీలో జరగనుంది. అలాగే పెద్ద ఎత్తున కార్మికుల సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులంతా పాల్గొంటారు. ఈ సమావేశం ఏర్పాట్లలో ఎల్‌జేపీ రాష్ట్ర కమిటీ నిమగ్నమై ఉంది. లోక్ జనశక్తి పార్టీ జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ జార్ఖండ్‌లో 28కి పైగా స్థానాల్లో పార్టీ పటిష్ట స్థితిలో ఉందని, అక్కడ పార్టీ తన అభ్యర్థులను పోటీకి పెడుతుందన్నారు. జార్ఖండ్‌లో ఎల్‌జేపీ బలమైన స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఎల్‌జేపీ గతంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పారు. ఎల్‌జేపీ ఒంటరిగా పోటీచేస్తే బీజేపీ కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..


బీజేపీ రియాక్షన్ ఇదే..

జార్ఖండ్‌లో 28 స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందన్న వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు తాము బలంగా ఉన్నామని చెప్పుకుంటాయని, ఎన్నికల్లోనే పార్టీ బలాబలాలు తెలుస్తాయన్నారు. ఫిరంగి లైసెన్స్ అడిగితే తుపాకీ లైసెన్స్ వస్తుందనే సామెతను బీజేపీ ప్రస్తావిస్తోంది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు కలిసే పోటీచేస్తాయని, సీట్ల సర్ధుబాటు కేంద్ర నాయకత్వం పరిధిలో ఉన్న అంశమని బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. మిత్రపక్షాలతో సీట్ల సర్థుబాటు విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది. ఎన్డీయే పక్షాలు కలిసి పోటీచేస్తాయా.. లేదా వేర్వేరుగా పోటీచేస్తాయా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.


Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 10:32 PM