Share News

Indian Railway : వామ్మో.. రైలు టికెట్ రద్దుతో రైల్వేకు ఇంత ఆదాయం వస్తోందా..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:40 PM

దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా రైల్వేలు నిలుస్తున్నాయి. చాలా మంది రైలు ప్రయాణం ( Indian Railway ) చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకని పరిస్థితి.

Indian Railway : వామ్మో.. రైలు టికెట్ రద్దుతో రైల్వేకు ఇంత ఆదాయం వస్తోందా..!

దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా రైల్వేలు నిలుస్తున్నాయి. చాలా మంది రైలు ప్రయాణం ( Indian Railway ) చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకని పరిస్థితి. అందుకే స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారు రెండు మూడు నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకుంటారు. ఇక పండుగలు, సెలవుల సమయాల్లో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం రద్దు అవుతుంది. దీంతో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. టికెట్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో మన దగ్గర నుంచి రైల్వే కొంత రుసుమును తీసుకుంటుంది. టికెట్ కోసం చెల్లించిన మొత్తంలో పెనాల్టీని తీసుకుని మిగిలిన డబ్బును మనకు ఇస్తుంది. ఇలా ఒక సంవత్సరంలో రైల్వేలకు ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలుసా..


AAP: అతిశీకి ఎన్నికల సంఘం నోటీసులు.. సమాధానం ఇవ్వాలంటూ డెడ్ లైన్..

ప్రభుత్వానికి రైల్వేలే అతిపెద్ద ఆదాయ వనరు. రైల్వే బడ్జెట్, ఆదాయాలు రెండూ వేల కోట్ల రూపాయలలో ఉంటాయి. టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా కూడా రైల్వేలు ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. దేశంలోని మొత్తం 17 జోన్లలో ఈ ఏడాది మార్చి 20 వరకు టిక్కెట్ రద్దు ద్వారా నార్త్ వెస్ట్రన్ రైల్వే రూ.111 కోట్లు సంపాదించింది. దీనిని బట్టి మొత్తం 17 జోన్లకు ఎంత ఆదాయం సమకూరిందో ఊహించుకోవచ్చు.


Uttar Pradesh: యూపీ మదర్సా చట్టం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన..

టికెట్ బుక్ చేసుని ప్రయాణం చేయకపోతే రైల్వే ఆ సీటును మరొక ప్రయాణికుడి రిజర్వ్ చేస్తుంది. ఈ రకంగా చేయడం వల్ల రైల్వే రెండు రకాలుగా ఆదాయం సంపాదిస్తుంది. మొదటి ప్రయాణీకుడి నుంచి రద్దు ఛార్జీలు వసూలు చేయడం, రెండో ప్రయాణీకుడి సీటు ద్వారా సైతం ఆదాయాన్ని పొందుతుంది. కొన్ని కారణాల వల్ల రైళ్లు రద్దు అవుతుంటాయి. ఆ సమయంలోనూ రద్దు ఛార్జీలు మినహాయించి మిగతా నగదును ప్రయాణికుడికి అందిస్తుంది భారతీయ రైల్వే.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 04:40 PM