Share News

NRI Voting: ఎన్నారై ఓటింగ్ గురించి షాకింగ్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఒక్కరూ కూడా..

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:55 PM

లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం ఓ కీలక డేటాను విడుదల చేసింది. ఈ ప్రకారం విదేశాలలో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు షాకింగ్ నిజాలను బయటపెట్టాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

NRI Voting: ఎన్నారై ఓటింగ్ గురించి షాకింగ్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఒక్కరూ కూడా..
NRIs Voting 2024

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఓ కీలక డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ (NRI voting) గణాంకాల గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఓటరు జాబితాలో ఎన్‌ఆర్ఐ ఓటర్లు వారి పేర్లను చేర్చుకునే సమయంలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం (Election Commission) తెలిపింది. ఆ క్రమంలో ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేరుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఇండియాకు ఓటు వేసేందుకు వచ్చింది కేవలం 2.48 శాతం మంది మాత్రమే.


నిరాశపరిచిన ఎన్‌ఆర్ఐలు

డేటా ప్రకారం 2024లో 1,19,374 మంది ఎన్‌ఆర్ఐలు వారి పేర్లను నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేసింది. ఇందులో కేరళ నుంచి అత్యధికంగా 89,839 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో కేవలం 2,958 మంది మాత్రమే భారతదేశానికి వచ్చారు. అందులో 2,670 మంది కేరళ నుంచి మాత్రమే ఉన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 885 మంది విదేశీ ఓటర్లలో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారని నివేదిక తెలిపింది. దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ రాష్ట్రాల నుంచి ఒక్క ఎన్నారై కూడా ఓటు వేయడానికి రాలేదు

ఇలాంటి గణాంకాలు మహారాష్ట్రలో కూడా కనిపించాయి. అక్కడ 5,097 మంది ఎన్నారై ఓటర్లలో 17 మంది మాత్రమే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,927 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నమోదయ్యారు. కానీ 195 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక విదేశాల్లో నివసిస్తున్న కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ట్రాల నుంచి ఒక్క ఎన్నారై కూడా ఓటు వేసేందుకు భారత్‌కు రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అసోం 19 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయలేదు. బీహార్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. నమోదు చేసుకున్న 89 మంది ఎన్నారై ఓటర్లలో ఎవరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 84 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయని పరిస్థితి గోవాలో కనిపించింది.


ఎన్నారై ఓటింగ్ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు

భారతదేశంలోని ఎన్నారై ఓటర్లు ఇక్కడ మాత్రమే తమ ఓటు వేయగలరు. వారి భారతీయ చిరునామా ఆధారంగా ఓటరు జాబితాలో పేరు నమోదైంది. అయితే ఓటు వేయడానికి వారు వ్యక్తిగతంగా తమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. చాలా మంది ఎన్నారై ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోవడానికి ఇదే కారణం. ఎన్నారై ఓటింగ్ తగ్గడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో సమయాభావం, భారీ ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ప్రజలు ఓటు వేసేందుకు రావడం మానేశారని పలువురు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 29 , 2024 | 01:57 PM