Yogi Adityanath: యువకుడి ఎన్‌కౌంటర్‌పై స్పందించిన యూపీ సీఎం.. అఖిలేష్‌పై ఫైర్..
ABN , Publish Date - Sep 08 , 2024 | 06:22 PM
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్ రాజకీయ రంగు పులుముకుంది. సమాజ్‌వాదీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. మంగేష్ యాదవ్ కుటుంబంతో పాటు ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వానికి, పోలీసులకు అనేక ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం చేసిన తీవ్రమైన నేరమన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
అఖిలేష్‌పై యోగి ఫైర్..
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపటానికి ప్రజల మద్దతు అవసరమని, వారసత్వం కాదన్నారు. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మంగేష్ యాదవ్ ఒక దొంగ అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆయుధాలతో ఆభరణాలు దోచుకోవడానికి వెళ్లాడని, అతడిని వదిలేస్తే కస్టమర్ లేదా, దుకాణ యజమానిని చంపి ఉండేవాడన్నారు. చనిపోయిన వ్యక్తి దళితుడో లేదా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి అయిఉండవచ్చని.. కానీ ఇక్కడ చూడాల్సిన మృతుడి వర్గం కాదన్నారు. అతడు ఎలాంటి వ్యక్తి.. వదిలేస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. 2017 కి ముందు రౌడీలు, మాఫియా పోలీసులను నడిపేవారని, ప్రస్తుతం మాఫియా పోలీసులకు భయపడి యూపీ నుంచి పారిపోతున్నారన్నారు.
Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు
మాఫియా అంతం..
ఉత్తరప్రదేశ్‌లో మాఫియా పాలన అంతం కాబోతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. గతంలో ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్‌లోని అన్ని ప్రాంతాలను గూండాలు, మాఫియా పాలించారన్నారు. ఆ సమయంలో మహిళల భద్రత, పరువు ప్రమాదంలో పడిందని, ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ఇప్పటికీ మిగిలిన కొందరు గూండాలు తమ చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం యూపీ మాఫియా రహిత రాష్ట్రంగా మారిందన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఎంత పెద్ద గూండా అయితే అంత ఉన్నతమైన పదవి వచ్చేదన్నారు.
National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా సలహా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News