Jammu & Kashmir:యాత్రికుల బస్సుపై కాల్పులు పాక్ ఉగ్రవాదుల పనే!
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:35 AM
జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లా తెర్యాత్ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
కనీసం ముగ్గురు పాల్గొన్నట్టు అంచనా
న్యూఢిల్లీ, జూన్ 10: జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లా తెర్యాత్ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతంలో మూడు ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నట్టు కూడా భావిస్తున్నారు. వైష్ణోదేవి దర్శనం నిమిత్తం వచ్చిన యాత్రికులు శివఖోడ్‌లో పూజలు ముగించుకొని ఆదివారం సాయంత్రం తెర్యాత్ గ్రామం వద్ద ఘాట్ రోడ్డు మీదుగా కాట్రా వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తూటాలు డ్రైవర్‌కు తగలడంతో ఆయన నియంత్రణ కోల్పోయారు. దాంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు.