Share News

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:32 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!
Parliament Budget Session 2024

ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session 2024) ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.


ఓట్ ఆన్ అకౌంట్ పద్దు..

ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పూర్తిస్థాయి పద్దును నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి లోక్ సభ సచివాలయం గురువారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది.


Tribals: ‘భిల్ ప్రదేశ్’ కోసం ట్రైబల్స్ ఉద్యమం

బిజినెస్ అడ్వైజరి కమిటీ ఏర్పాటు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఏర్పడింది. కమిటీలో 14 మందికి చోటు లభించింది. లోక్ సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి.. ఏ ఏ పార్టీలకు చర్చలో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో బీఏసీ ఖరారు చేస్తోంది. బీఏసీలో తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు దేశం పార్టీకి చోటు దక్కింది. ఆ పార్టీ తరఫున లోక్ సభ పక్ష నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు సభ్యుడిగా వ్యవహరిస్తారు. బీఏసీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి.


Read Latest
Telugu News and National News

Updated Date - Jul 18 , 2024 | 08:36 PM