Share News

Supreme Court: సుప్రీంకు ఢిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:51 PM

National: ఢిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్ దూబే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్, ముఖర్జీనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Supreme Court: సుప్రీంకు ఢిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు
Supreme Court

న్యూఢిల్లీ, జూలై 29: ఢిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు (UPSP Candidates Death Case) సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్ దూబే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్, ముఖర్జీనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆవేదన చెందారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వస్తోందని వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదని రాజేంద్రనగర్ ఘటన రుజువు చేసిందని యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్ దూబే ఆవేదన వ్యక్తం చేశారు.

Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు


ఇదీ జరిగింది...

కాగా.. గత శనివారం ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ మునిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృత్యువాతపడ్డారు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో.. కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు పోటెత్తింది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు ఆ కోచింగ్‌ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్నారు. వారంతా చదువులో నిమగ్నమై ఉండగా వరద నీరు చుట్టుముట్టింది. అక్కడ ఉన్నవారిలో కొంతమంది తప్పించుకోగా.. బీహార్‌కు చెందిన తానియా సోని (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయ యాదవ్‌ (25), కేరళకు చెందిన నెవిన్‌ డాల్విన్‌ (28) మృతి చెందారు. విషయం తెలియగానే ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని.. వరదలో చిక్కుకున్న విద్యార్థులను బయటికి తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

AP Politics: వైఎస్ విజయమ్మకు జేసీ ప్రభాకర్ భేటీ పలకరింపు


ఈ ప్రమాదం నేపథ్యంలో కోచింగ్‌ సెంటర్‌ యజమాని అభిషేక్‌ గుప్తా, సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ దేశ్‌పాల్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లోని 105, 106(1), 115(2), 290, 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే రావూస్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదుగురు నీటిని తోడిపోసే యంత్రాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కానీ, లోపలి నుంచి నీరు తోడి బయటకు పోద్దామంటే.. అప్పటికే వాననీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీరు పోయేదాకా వేచి ఉండి, ఆ తర్వాత బేస్‌మెంట్‌లోంచి నీటిని బయటకు పంప్‌ చేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

GST Scam: జీఎస్టీ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.. అరెస్ట్‌‌లు ఖాయమా?


ఢిల్లీ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రావూస్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ను వరద నీరు ముంచెత్తిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతిపట్ల ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాగా... రావూస్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు పాత రాజేంద్రనగర్ వద్ద కోచింగ్ సెంటర్లను ఆదివారం పరిశీలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని 13 కోచింగ్ సెంటర్లకు అధికారులు సీల్ వేశారు.


ఇవి కూడా చదవండి...

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

KCR Vs Revanth: విద్యుత్ కొనుగోళ్లపై సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

Read Latest National News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:01 PM