Share News

PM Modi: ఆర్థికవేత్తలతో మోదీ కీలక సమావేశం

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:41 PM

కేంద్రంలోని మోదీ(PM Modi) సర్కార్ జులై 23న 2024 - 25 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్(Union Budget 2024 - 25) ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులపై సమీక్షించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.

PM Modi: ఆర్థికవేత్తలతో మోదీ కీలక సమావేశం

ఢిల్లీ: కేంద్రంలోని మోదీ(PM Modi) సర్కార్ జులై 23న 2024 - 25 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్(Union Budget 2024 - 25) ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులపై సమీక్షించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ప్రముఖ ఆర్థిక వేత్తలు, నిపుణులతో మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు.

పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని నిలపాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.


ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చూస్తోంది. ఈ సమావేశంలో ఆర్థిక వేత్తలు, నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలను అనుసరించి బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు.

Read Latest News and National News

Updated Date - Jul 11 , 2024 | 09:43 PM