President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
ABN , Publish Date - Nov 26 , 2024 | 01:53 PM
భారత రాజ్యాంగం ప్రత్యక్ష, ప్రగతి శీల పత్రం వంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడకుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం ప్రత్యక్ష, ప్రగతి శీల పత్రం వంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడకుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలు రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్ధేశం చేశారని కొనియాడారుర. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. మన రాజ్యాగం సజీవ, ప్రతతిశీల పత్రమని, దీన్ని ఆధారంగా చేసుకునే సమాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగామని అన్నారు.
పేదలకు పక్కా గృహాలు అందించడంతో పాటూ మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పరోగతిని సాధించామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన 15 మంది మహిళల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు, స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.