Viral Video: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ
ABN , Publish Date - Aug 29 , 2024 | 02:42 PM
ఇటివల వెలుగులోకి వచ్చిన వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు టెక్నిక్‌ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం కనిపించింది. రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక వీడియో ద్వారా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
గతంలో ఓడిన రాహుల్
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ తన పంథాను మార్చుకుని ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూ భారత్ జోడో యాత్రను నిర్వహించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, ఆ తర్వాత మణిపూర్ నుంచి గుజరాత్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంత ప్రయోజనం చేకూర్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సంఖ్య 99కి పెరిగింది. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశంలోని వివిధ సమాజిక వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ఆ క్రమంలో పలు రకాల వీడియోలను విడుదల చేశారు.
కారణమిదే..
అయితే తాజాగా విడుదల చేసిన వీడియో కూడా భారత్ జోడో న్యాయ్ యాత్ర కాలం నాటిదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ పర్యటనలో భాగంగా సాయంత్రం శిబిరంలో మార్షల్ ఆర్ట్ జియు-జిట్సు సాధన చేశారు. యువతలో హింసకు బదులు సౌమ్యత విలువను పెంపొందించడమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.
మార్షల్ ఆర్ట్ క్రీడ
ఇప్పుడు జియు-జిట్సు అనేది బ్రెజిల్ మార్షల్ ఆర్ట్. దీనిలో ప్రత్యర్థిని పట్టుకోవడం ద్వారా నియంత్రించాలి. దీనిని BJJ అని కూడా అంటారు. కరాటే, బాక్సింగ్ లాగా ఇందులో ప్రత్యర్థికి దెబ్బ తగలదు. రాహుల్ గాంధీ కూడా జియు-జిట్సులో బ్లాక్ బెల్ట్ హోల్డర్. గతంలో రాహుల్ గాంధీ సముద్రంలో ఈదుతూ ప్రదర్శించారు. ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ఇవి కూడా చదవండి:
Smriti Irani: ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి
Heavy Rains : వాతావరణ శాఖ కీలక ప్రకటన.. మరో మూడ్రోజులు వర్షాలు
Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..
Read More National News and Latest Telugu News