Share News

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:12 PM

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు.


"పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ఇండియా కూటమి(INDIA Alliance) సహకరిస్తుంది. ప్రభుత్వానికి రాజకీయ శక్తి ఉంది.అదే సమయంలో ప్రతిపక్షానికి కూడా దేశ ప్రజల గొంతు ఉంది. గత ఎన్నికల కంటే ఈసారి విపక్షాల బలం ఎక్కువగా ఉంది. దేశ ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే సందేశాన్ని లోక్ సభ ఎన్నికలు నిరూపించాయి. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం కల్పించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి" అని రాహుల్ పేర్కొన్నారు.


సమాన అవకాశాలివ్వాలి..

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. "అధికార పార్టీపైకూడా స్పీకర్ నియంత్రణ ఉండాలి. మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. సభ సజావుగా సాగేందుకు పూర్తిగా సహకరిస్తాం" అని అఖిలేష్ అన్నారు. మరోవైపు లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌ ఎన్నిక కోసం శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం ప్రతిపాదించారు. పలువురు ఇండియా కూటమి నేతలు ఆయన్ని బలపరిచారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉండటంతో వాయిస్ ఓట్ ద్వారా ఓం బిర్లా స్పీకర్ పదవికి ఎన్నికైనట్టుగా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతబ్ ప్రకటించారు.

.For Latest News and National News click here..

Updated Date - Jun 26 , 2024 | 01:01 PM