Rahul Gandhi: నేడు కోర్టుకు రాహుల్ గాంధీ.. అసలేంటి కేసు
ABN , Publish Date - Jun 07 , 2024 | 09:12 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ బెంగళూరు కోర్టులో హాజరుకానున్నారు. కర్ణాటక బీజేపీ వేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నేడు ఉదయం 10.30 గంటలకు విచారణను ఎదుర్కొనున్నారు. బీజేపీ పెట్టిన ఈ కేసులో రాహుల్ గాంధీ నాలుగో ముద్దాయిగా ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ బెంగళూరు కోర్టులో హాజరుకానున్నారు. కర్ణాటక బీజేపీ వేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నేడు ఉదయం 10.30 గంటలకు విచారణను ఎదుర్కొనున్నారు. బీజేపీ పెట్టిన ఈ కేసులో రాహుల్ గాంధీ నాలుగో ముద్దాయిగా ఉన్నారు. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. ఇందుకోసం రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరు(Bengaluru) బయలుదేరి వచ్చారు.
అయితే 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వార్తాపత్రికలలో పరువు నష్టం కలిగించే ప్రకటనలను ప్రచురించారని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ (BJP) కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం కేసు వేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి జూన్ 7న కోర్టుకు హాజరు కావాలని కర్ణాటక కోర్టు(Bengaluru court) రాహుల్ గాంధీని కోరింది. ఆ ప్రకటనలో 2019-2023లో అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది.
అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా బీజేపీ నేతలపై కాంగ్రెస్ ప్రధాన పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రకటనల్లో అన్ని ప్రజా పనులలో బీజేపీ 40 శాతం కమీషన్ తీసుకుంటుందని ఆరోపిస్తూ 'అవినీతి రేటు కార్డు'ను కూడా ప్రచురించారు. ఆ పోస్టులను రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో తప్పుడు ప్రకటనలు చేశారంటూ బీజేపీ(BJP) ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేశారు. జూన్ 1న ఈ కేసు విచారణ సందర్భంగా సిద్ధరామయ్య, శివకుమార్‌లు కోర్టుకు హాజరయ్యారు. అయితే అప్పుడు రాహుల్ గాంధీ హాజరుకాలేదు. దీంతో బీజేపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ రెండోసారి హాజరు కానందున సీఆర్‌పీసీ 205 కింద మినహాయింపు ఇవ్వరాదని అన్నారు.
అయితే కాంగ్రెస్(congress) లాయర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా బ్లాక్ సమావేశానికి హాజరవుతున్నారని, ఆయన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారని చెప్పారు. శనివారం (జూన్ 1) విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తదుపరి తేదీన జూన్ 7న రాహుల్ హాజరవుతారని తెలిపారు. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు జూన్ 1న బెయిల్ మంజూరైంది.
ఇవి కూడా చదవండి..
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాబరిలోకి..!!
T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా
For Latest News and National News click here