Share News

Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే..!!

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:41 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై 3వ తేదీ (బుధవారం) ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు.

Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే..!!
Rahul Gandhi Write Letter To PM Modi

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై 3వ తేదీ (బుధవారం) ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ, విపక్ష నేత, ప్రధాన పార్టీల నేతలు ధన్యవాదాలు చెబుతున్నారు. సమావేశాల్లో మరో అంశంపై చర్చకు అవకాశం లేదు. ప్రతిపక్షం మాత్రం నీట్ యూజీలో జరిగిన అక్రమాలపై చర్చ జరపాల్సిందేనని పట్టుబడుతోంది.


రంగంలోకి సీబీఐ

నీట్ అక్రమాలపై విచారణ జరపాలని విద్యాశాఖ కోరడంతో సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ సహా రాజస్థాన్, గుజరాత్‌లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసింది. జార్ఖండ్ హజారిబాగ్ ఓయాసిస్ స్కూల్‌‌లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. తప్పు చేసిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. గుజరాత్ గోధారా స్కూల్‌కు చెందిన ఓనర్ జే జలరాం, జర్నలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలో సాయం చేస్తామని జలరాం స్కూల్ ఓనర్ అభ్యర్థుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ అధికారులు వివరించారు.


Also Read: PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్

ఓ వైద్యుడు ఇలా

నీట్ పరీక్షలో తన కుమారుడు పాస్ అయ్యేందుకు ప్రయాగ్ రాజ్‌‌ నైనికి చెందిన డాక్టర్ రూ.4 లక్షలు ఇచ్చారని సీబీఐ అధికారులు గుర్తించారు. కుమారుడితో సహా వైద్యుడు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వివరించారు.


Read Latest
National News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 05:41 PM